JGL: మారుతున్న కాలానికి కనుగుణంగా ఉపాధ్యాయులు సాంకేతిక నైపుణ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాలలో ఆదివారం ఉత్తమ ఉపాధ్యాయులకు ఆయన అవార్డులను, ప్రశంసా పత్రాలను అందజేసి మాట్లాడారు. రాష్ట్రంలో జిల్లాను విద్యా రంగంలో ఉన్నత స్థానంలో నిలిపేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు.