NZB: భీమగల్ మండలం బడా భీమగల్లో వినాయక నిమజ్జన బందోబస్తు నిర్వహిస్తున్న పోలీసుల వాహనంపై ఆదివారం తెల్లవారు జామున ఆకతాయిలు రాళ్లు రువ్వారు. ఈ దాడిలో పోలీసుల పెట్రోలింగ్ వాహనం వెనుక భాగం వైపు ఉన్న అద్దం పూర్తిగా ధ్వంసం అయ్యింది. పోలీసు వాహనంపై రాళ్లతో దాడి చేసిన వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు ఎస్సై సందీప్ తెలిపారు.