NLR: కూటమి ప్రభుత్వం రైతులను ఆదుకోవడంలో విఫలమైందని ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అన్నదాతలకు అండగా YCP పోస్టర్ను ఆయన నెల్లూరులో ఆవిష్కరించారు. ఈనెల 9న అన్ని RDO కార్యాలయాల ఎదుట ఆందోళన చేస్తున్నట్లు వెల్లడించారు. యూరియా కొరతతో రాష్ట్రంలోని రైతాంగం తీవ్ర ఇబ్బందులు పడుతోందని మండిపడ్డారు.