ఆర్చరీ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో భారత్ అద్భుత ప్రదర్శన కనబరిచింది. రిషభ్ యాదవ్, అమన్ సైనీ, ప్రథమేష్తో కూడిన భారత జట్టు ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌ను 235-233 తేడాతో ఓడించి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. అలాగే, మిక్స్డ్ టీమ్ ఫైనల్స్‌లో వెన్నం జ్యోతి, రిషభ్ యాదవ్ జోడీ నెదర్లాండ్స్ చేతిలో 157-155 తేడాతో ఓడిపోయి రజతం గెలుచుకుంది.