KMM: నేలకొండపల్లి మండలంలోని రాయిగూడెం గ్రామంలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి దెబ్బ తగిలింది. పదిరోజుల వ్యవధిలో మూడోసారి వరుసగా పెద్ద ఎత్తున చేరికలు జరగడంతో గ్రామంలో బీఆర్ఎస్ ప్రభావం గల్లంతైపోయింది. ఆదివారం మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయ ఇన్ఛార్జి తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో పలువురు కాంగ్రెస్ పార్టీలో చేరారు.