SKLM: ప్రస్తుతం వ్యాధులు ముసురుతున్న నేపథ్యంలో టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రి రోగులతో కిటకిటలాడుతోంది. గ్రామాల్లో సరైన ఫీవర్ సర్వేలు లేకపోవడంతో ప్రతి ఇంట్లో జ్వర పీడితులు అవస్థలు పడుతున్నారు. టెక్కలి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రస్తుతం రోజుకు 500కు పైగా ఓపీలు నమోదు కాగా వాటిలో సగానికి పైగా జ్వర పీడితులు ఉంటారని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి.