కాంగ్రెస్ చీఫ్ ఖర్గే ఎన్నికల కమిషన్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు. పదేళ్లుగా ఈసీ ఓటు చోరులను కాపాడుతూ వస్తుందన్నారు. కీలక సమాచారాన్ని దాచి పెట్టిందని విమర్శించారు. ఓట్ల చోరీకి పాల్పడుతున్న వారిని కాపాడటమే లక్ష్యంగా ఈసీ పదేళ్లుగా పని చేస్తోందని ఆరోపించారు. ఓట్ల చోరీకి వ్యతిరేకంగా బీహార్‌లో చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ దేశవ్యాప్తంగా ఉద్యమంగా మారుతుందన్నారు.