కృష్ణా: పెడన మండలం కవిపురంలో ఇటీవల మృతి చెందిన రైతు పుప్పాల మాణిక్య రావుకు పీఏసీఎస్ జనతా ఇన్సూరెన్స్ పథకం కింద రూ.2 లక్షల మంజూరయ్యాయి. ఆదివారం మృతుని భార్యకు ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ చెక్కును అందజేశారు. మరో రైతు అచ్యుత వీరన్న ఇటీవల మృతి చెందగా అతని కుటుంబానికి సొసైటీ తరఫున రూ.10 వేలను అందించారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, అధికారులు పాల్గొన్నారు.