E.G: కడియం మండలంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి నేతల మల్లికార్జున రావు ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతుల పొలాలను ఆదివారం పరిశీలించారు. రైతులకు యూరియా వినియోగంపై అవగాహన కల్పించారు. యూరియా తగు పరిమాణంలోనే మాత్రమే వాడాలని అధికంగా వాడితే పంట దిగుబడికి నష్టం వాటిల్లుతుందని రైతులకు పలు సూచనలు చేశారు. అమోనియా, నానో యూరియాలను రైతులు వాడుకోవాలన్నారు.