సిద్దిపేట పట్టణంలో వాసవి క్లబ్, వనిత క్లబ్ ఆధ్వర్యంలో వాసవి వారోత్సవాలు ఘనంగా నిర్వహించి ఆదివారం ముగించారు. ఇవాళ చివరి రోజు కావడంలో అభయ జ్యోతి మనోవికాస కేంద్రం విద్యార్థులకు బ్యాగులు, నోట్ బుక్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైస్ గవర్నర్ మంకాల నవీన్, మర్యాల వాణి, అధ్యక్షుడు మురంశెట్టి కుమార్, మంజుల, మర్యాల వీరేశం, ఉపాధ్యాయుడు జోజి పాల్గొన్నారు.