BDK: బూర్గంపాడు మండలాల సరిహద్దులోని కిన్నెరసాని వాగు సమీపంలో, ఉన్న గుడుంబా స్థావరాలపై పోలీసులు ఆదివారం దాడులు నిర్వహించినట్టు కుక్కునూరు సీఐ రమేష్ బాబు ప్రకటించారు. ఈ దాడుల్లో పోలీసులు మూడు గుడుంబా తయారీ బట్టీలను ఉలిచివేసి, 8 పానకం డ్రమ్ములను ధ్వంసం చేశారు. గుడుంబా సరఫరా చేస్తున్న ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు.