NDL: చంద్రగ్రహణం సందర్భంగా ఆళ్లగడ్డ మండలంలోని ప్రముఖ వైష్ణవ క్షేత్రమైన అహోబిలం లక్ష్మీ నరసింహ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి మధ్యాహ్నం 12 గంటలకు ఆలయం తలుపులు మూసివేశారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాత సేవతో ఆలయ సంప్రోక్షణ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తామని ప్రధాన అర్చకుడు వేణుగోపాల్ తెలిపారు.