NRML: దివ్యాంగ విద్యార్థుల ఉపకరణాల నిర్ధారణ శిబిరం విజయవంతమైనట్లు జిల్లా విద్యాశాఖ సమన్వయకర్త ప్రవీణ్ కుమార్ తెలిపారు. శనివారం విద్యాశాఖ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష, అలీంకో సంస్థ సంయుక్తంగా ఈ శిబిరాన్ని నిర్వహించారు. ఇందులో 120 మంది విద్యార్థులను అర్హులుగా గుర్తించామని, వారికి త్వరలోనే ఉపకరణాలు అందజేస్తామని ఆయన తెలిపారు.