MNCL: సింగరేణిలో అక్టోబర్ 3న దసరా పండుగ సెలవు ప్రకటించాలని గుర్తింపు సంఘం ఏఐటీయూసీ ప్రధాన కార్యదర్శి కొరిమి రాజ్ కుమార్ కోరారు. ఈ మేరకు సంస్థ సీ అండ్ ఎండీకి ఆయన లేఖ రాశారు. గాంధీ జయంతి, దసరా విరుద్ధమైన పండుగలని, ఒకే రోజు రావడంతో కార్మికులు ఇబ్బందులు పడుతారని తెలిపారు. అలాగే కార్మికులు పండుగ సెలవు కోల్పోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు.