KNR: పట్టణం పద్మా నగర్లోని పారామిత పాఠశాలలో ఆదివారం జిల్లాస్థాయి ఇంగ్లీష్ హ్యాండ్ రైటింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటిల్లో వీణవంక ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు వివేక్, రజిని, శ్రీనిత్య, సింధుజ, వైశాలిలు పాల్గొని ప్రతిభ చూపారు. ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థుల నైపుణ్యాన్ని ప్రిన్సిపల్ .రాజిరెడ్డి కొనియాడారు.