TPT: టీటీడీ SV అన్నప్రసాదం ట్రస్టుకు తిరుపతికి చెందిన తిరుపతి తిరుమల హెల్త్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ నాగార్జున నాయుడు ఆదివారం రూ. 10 లక్షలు విరాళంగా అందించారు. ఇందులో భాగంగా తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి చెక్కును అందజేశారు. ఈ విరాళ కార్యక్రమంలో దాతతో పాటు తిరపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు పాల్గొన్నారు.