ATP: జిల్లాలో ఒకప్పుడు బోరింగులు లేకపోతే నీళ్ల కోసం ఇబ్బందులు పడేవారు. గ్రామాలలో నీళ్లు తెచ్చుకునేందుకు ప్రజలు బిందెలు క్యూ కట్టి ఎదురుచూసే వారు. ప్రస్తుతం కొన్ని చోట్ల బోరింగ్ నీళ్లు కనిపిస్తే అప్పటి పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. నీటి కోసం ప్రజలు ఎదుర్కొన్న కష్టాలు, ఆ జ్ఞాపకాలు అందరి కళ్ల ఎదుటే మెదులుతున్నాయి.