అనకాపల్లి: చోడవరం మండలం లక్కవరంలో రైతులకు ఆదివారం ఉదయం యూరియా పంపిణీ చేశారు. పంపిణీ జరుగుతున్న తీరును జిల్లా వ్యవసాయ అధికారి బి.మోహన్ రావు పర్యవేక్షించారు. రైతులు యూరియా కోసం ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన అవసరం లేదని, ప్రతి రైతుకు యూరియా అందజేస్తామని ఆయన చెప్పారు.