KMM: చంద్రగ్రహణం సందర్భంగా ఖమ్మం నగరంలోని శ్రీ భ్రమరాంబ సమేత శ్రీ గుంటు మల్లేశ్వర స్వామి దేవాలయాన్ని ఆలయ అధికారులు, అర్చకులు ఆదివారం మూసివేశారు. సోమవారం ఉదయం ఆలయ శుద్ధి సంప్రోక్షణ, ప్రత్యేక పూజల అనంతరం భక్తులకు 9 గంటలకు దర్శనానికి అనుమతి ఉంటుందని దేవాదాయ శాఖ నిర్వహణ అధికారి తెలిపారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు.