సత్యసాయి: నల్లమాడ మండలం కొండ్రవారిపల్లి గ్రామానికి చెందిన రంగస్వామి నాయుడు (48) హైదరాబాద్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. ఆయన మృతి వార్త తెలుసుకున్న పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి గ్రామానికి చేరుకుని పార్థివ దేహానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.