SRCL: నిరుపేదలకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. ఆదివారం వేములవాడ అర్బన్ మండలం అగ్రహారంలో కలెక్టర్ సందీప్ కుమార్ ఝాతో కలిసి అర్బన్ మండల లబ్ధిదారులకు మంజూరైన 1,550 ఇందిరమ్మ ఇళ్ల ప్రొసీడింగ్ కాపీలను అందజేశారు. వీలైనంత త్వరగా ఇళ్లను నిర్మించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.