నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు తెగ ఎదురుచూస్తున్నారు. గతంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఆ విషయంపై ఎలాంటి అప్డేట్ రాలేదు. తాజాగా ఈ సినిమాపై ప్రశాంత్ వర్మ స్పందించారు. ఈ సినిమా గురించి నిర్మాతలు చెప్పాలని, ప్రస్తుతం దానిపై తాను ఏమీ చెప్పలేనని తెలిపారు.