CTR: వెదురుకుప్పం(M) బందార్లపల్లి క్వారీ గొడవపై MLA థామస్ స్పందించారు. ఈ ఘటన తనను కలిచివేసిందని, క్వారీ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను ఆదేశించారు. ఈ మేరకు బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి క్వారీని వెంటనే మూయించేలా చర్యలు తీసుకుంటామని MLA వివరించారు.