రష్యా-ఉక్రెయిన్ల మధ్య యుద్ధం కొనసాగుతోంది. ఈ క్రమంలో అమెరికాకు శరణార్థిగా వచ్చిన ఉక్రెయిన్ మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మృతురాలిని ఉక్రెయిన్‌కు చెందిన ఇరినా జరుత్స్కానుగా గుర్తించారు. రైల్లో ప్రయాణిస్తున్న సమయంలో ఆమె వెనుక కూర్చున్న నిందితుడు డెకార్లోస్ బ్రౌన్ జూనియర్ కత్తితో పొడిచి చంపేశాడు.