ఆసియా కప్‌లో అక్షర్ పటేల్ టీమిండియాకు ఎక్స్ ఫ్యాక్టర్‌గా మారనున్నాడని మాజీ క్రికెటర్ అజింక్య రహానే పేర్కొన్నాడు. దుబాయ్‌లోని పిచ్‌లు అతడికి అనుకూలంగా ఉంటాయని రహానే చెప్పాడు. బ్యాటింగ్, బౌలింగ్‌లో అక్షర్ అద్భుతంగా రాణిస్తున్నప్పటికీ.. అతనికి సరైన గుర్తింపు లభించలేదని అభిప్రాయపడ్డాడు. అన్ని ఫార్మాట్లో అతడు రాణించగలడని తెలిపాడు.