KNR: పౌర్ణమి సందర్భంగా చొప్పదండిలోని పలు దేవాలయాల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. సాయిబాబా ఆలయంలో అభిషేకం, మధ్యాహ్న హారతి, ప్రత్యేక పల్లకి సేవ, అన్న ప్రసాద వితరణ చేపట్టారు. జ్ఞాన సరస్వతి ఆలయంలో అమ్మవారికి అభిషేకం అనంతరం ప్రత్యేక పూజలు చేశారు. పల్లకిసేవ అనంతరం అన్న ప్రసాదం వితరణ చేశారు. ఆయా కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.