ATP: గుత్తి మున్సిపాలిటీ కార్యాలయంలో సోమవారం మున్సిపాలిటీలోని వివిధ శాఖల అధికారులు, సిబ్బందితో కమిషనర్ జబ్బర్ మియా సమావేశం నిర్వహించారు. కమిషనర్ మాట్లాడుతూ.. వార్డులో సమస్యల గురించి అరా తీశారు. పెండింగ్లో ఉన్న ఆస్తి పన్నును ఇంటింటికి తిరిగి వసూలు చేయాలని సిబ్బందికి సూచించారు. వార్డులో ఏమైనా సమస్యలు ఉంటే తమ దృష్టికి తీసుకురావాలని తెలిపారు.