కామారెడ్డిలో ఈ నెల 15న జరగనున్న బీసీ అభినందన సభ స్థలాన్ని మంత్రులు ఆదివారం పరిశీలించారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడం పట్ల జిల్లా కేంద్రంలో అభినందన సభ ఏర్పాటు చేయనున్నారు. ఈ సందర్భంగా ఈ సభ స్థలాన్ని మంత్రులు సీతక్క పొన్నం ప్రభాకర్ శ్రీనివాస్ రెడ్డితో పాటు నాయకులు పరిశీలించారు.