కర్నూలు: సుంకేసుల రోడ్డులోని సెయింట్ జోసెఫ్ కాలేజీలో ఈనెల 13న జాబ్ మేళా జరగనుందని మంత్రి టీజీ భరత్ ప్రకటించారు. తన కార్యాలయంలో ఈ మేళా కరపత్రాలను ఆవిష్కరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగ అవకాశాల సృష్టి దిశగా కృషి చేస్తోందని తెలిపారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.