JGL: జిల్లా స్టేట్ టీచర్స్ యూనియన్ నాయకులు మచ్చ శంకర్, బైరం హరికిరణ్ ఆదివారం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రాథమిక పాఠశాలల్లో పదోన్నతుల కారణంగా ఖాళీ అయిన ఎస్జీటీ పోస్టులను విద్యావాలంటీర్లతో భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల చదువుకు అంతరాయం కలగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.