ADB: మాజీ ఎంపీ సోయం బాపూరావు, తెల్లం వెంకట్రావుపై లంబాడి నాయకులు చేస్తున్న అనుచిత వ్యాఖ్యలు సరైనవి కావని రాంజీ గోండు సేవా సమితి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విషంరావ్ పేర్కొన్నారు. మావల మండలంలో ఆదివారం నాయకులు మాట్లాడారు. లంబాడాలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని సుప్రీంకోర్టులో వేయగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు పంపడం జరిగిందని తెలిపారు.