AP: మాజీ MLA కేతిరెడ్డి పెద్దారెడ్డికి పోలీసులు షాక్ ఇచ్చారు. తాడిపత్రి విడిచి వెళ్లాలని కేతిరెడ్డికి ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈనెల 10న అనంతపురంలో CM చంద్రబాబు పర్యటించనున్నారు. సీఎం పర్యటన తర్వాత తాడిపత్రికి రావాలని సూచించారు. తాడిపత్రిలో YCP, TDP మధ్య ఘర్షణలు తారస్థాయికి చేరిన విషయం తెలిసిందే. అందువల్లే సీఎం పర్యటన దృష్ట్యా పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.