ADB: ఇంద్రవేల్లి ZPHS పాఠశాలలో 2004-05 పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు తన స్నేహితుని కుటుంబానికి అండగా నిలిచారు. మండల కేంద్రంలోని భీంనగర్ కాలనీకి చెందిన గాయక్ వాడ్ రాజు ఇటీవల తీవ్ర అనారోగ్యానికి గురై మృతి చెందాడు. ఆయన కుటుంబ ఆర్థిక పరిస్థితి తెలుసుకున్న పూర్వ విద్యార్థులు రూ. 35వేలను సమీకరించి ఆయన కుటుంబానికి ఆదివారం అందజేశారు.