VZM: కొత్తవలస మండలం చింతలపాలెం గ్రామానికి చెందిన యూనిట్ కో కన్వీనర్ సేనల నానాజీకి స్టేట్ నగరాల కార్పొరేషన్ డైరెక్టర్గా అవకాశం కల్పించినందుకు ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారిని కలిసి ధన్యవాదములు తెలిపారు. అనంతరం ఆమె నానాజీకి పుష్పగుచ్చం అందించి శాలువాతో సన్మానించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. టీడీపీలో కష్టపడిన ప్రతి ఒక్క కార్యకర్తకు గుర్తింపు ఉంటుందన్నారు.