BDK: సెప్టెంబర్ 10, 11వ తేదీలలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో రెండు రోజుల పర్యటన అనివార్య కారణాల వలన వాయిదా వేయడం జరిగిందని ఆదివారం భద్రాద్రి జిల్లా BRS పార్టీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు ప్రకటించారు. మళ్లీ వారంలో వారి పర్యటన వివరాలను తెలియజేస్తామని అన్నారు.