WGL: జిల్లావ్యాప్తంగా శనివారం రాత్రి నుంచి కురిసిన వర్షపాతం వివరాలను వాతావరణ శాఖ వెల్లడించింది. ఖిలా వరంగల్ ప్రాంతంలో 56 మి.మీ వర్షపాతం నమోదు కాగా.. గీసుకొండలో 38, దుగ్గొండి, సంగెం, నల్లబెల్లిలో 20 మి.మీ వర్షపాతం రికార్డయింది. వర్ధన్నపేట, రాయపర్తి మండలాల్లో వర్షం కురువలేదని, చెన్నారావుపేట, నర్సంపేట, పర్వతగిరిలో ఓ మోస్తరుగా వాన పడింది.