NLG: చిట్యాల మండలం వనిపాకలలో మోడీ చిత్రపటానికి బీజేపీ నాయకులు ఆదివారం పాలభిషేకం చేశారు. పార్టీ మండల అధ్యక్షులు పీక వెంకన్న మాట్లాడుతూ… మధ్య తరగతి ప్రజలపై పన్నుల భారాన్ని తగ్గిస్తూ జీఎస్టీలో కీలక మార్పులు చేసిన ప్రధాని నరేంద్ర మోడీకి కృజ్ఞతలు తెలిపారు. నిత్యవసర సరుకులపై జీఎస్టీని ప్రభుత్వం తగ్గించటంతో వారికి ఎంతో ఊరట కలగనుందని పేర్కొన్నారు.