HYD: నగరంలో గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసిందని సీపీ సీవీ ఆనంద్ అన్నారు. ఈరోజు ఆయన మాట్లాడుతూ.. ఇంకా 900 విగ్రహాల నిమజ్జనం అవ్వాల్సి ఉందని, చిన్న విగ్రహాలు కలుపుకొని ఈరోజు 25 వేల విగ్రహాలు నిమజ్జనం అవ్వాలన్నారు. 40 గంటల పాటు నిమజ్జన శోభాయాత్ర జరిగిందని, ఈ ఏడాది విగ్రహాల ఎత్తు పెరగడం వల్ల ఊరేగింపు ఆలస్యమైందని పేర్కొన్నారు.