MBNR: హైదరాబాదులో నిర్వహించిన బ్రహ్మర్షి నారాయణ గురు జయంతి వేడుకలకు మాజీ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ గౌడ్ ఆదివారం హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి మాట్లాడుతూ.. సామాజిక మత, విద్యా పరివర్తనకు మార్గదర్శకుడు, సంఘసంస్కర్త అనగారిన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన బ్రహ్మర్షి నారాయణ గురు అడుగుజాడల్లో నడుద్దాం అన్నారు.