TG: పార్టీని బలోపేతం చేసేందుకు BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR జిల్లాల పర్యటనలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ మేరకు పార్టీ అధినేత KCRతో చర్చల తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. పార్టీ వీడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలని, స్థానిక ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా KTR ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.