KMM: తిరుమలాయపాలెం మండలం సుబ్లేడుకి చెందిన యూటీఎఫ్, సీపీఎం రాష్ట్ర నాయకులు జియావుద్దీన్ హఠాన్మరణం పట్ల ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి ఆదివారం ఓ ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఐటీడీఏ ఉమ్మడి జిల్లా పరిధిలో ఆదివాసీ పిల్లలకు మంచి విద్యాబోధనకు కృషి చేసిన ఆశ్రమ పాఠశాల హెచ్ఎంగా, వార్డెన్, ఉపాధ్యాయ ఉద్యమ నేతగా తనదైన ముద్ర వేసుకున్నారని చెప్పారు.