W.G: రెండవ శ్రీరంగంగా పేరుగాంచిన స్వయంభు కొటాలపర్రు కేశవ స్వామి ఆలయంలో ఆదివారం గజేంద్రమోక్షం వైభవంగా నిర్వహించారు. ఆలయంలో పవిత్రోత్సవాల్లో భాగంగా ఉదయం నుంచి కేశవ స్వామికి అభిషేకములు అర్చనలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అనంతరం గజేంద్రమోక్షం కార్యక్రమం నిర్వహించారు. పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు పాల్గొని వీక్షించారు.