ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ప్రస్తుతం ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ సినిమాతో బిజీగా ఉన్నారు. తాజాగా ఆయన యాక్టర్ నుంచి సింగర్‌గా మారారు. ఈ మూవీలోని ఫస్ట్ సింగిల్ ‘నువ్వుంటే చాలే’ పాటకు రామ్ లిరిక్స్ రాయగా.. తాజాగా రెండో పాట ‘అయ్యయ్యో పోయే పప్పీ షేమ్ ఆయే’ను స్వయంగా ఆయనే పాడారు. రేపు ఈ పాట ఫుల్ వెర్షన్ రిలీజ్ కానుంది. ఇక ఈ సినిమా నవంబర్ 28న విడుదల కాబోతుంది.