సిద్దిపేట: జిల్లా వ్యాప్తంగా తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న వినాయక విగ్రహాలను భక్తులు నిమజ్జనానికి తరలించారు. పలు కాలనీలు, గ్రామాల్లోని విగ్రహాలు గంగమ్మ ఒడికి చేరాయి. ఊరూరా శోభాయాత్రలు నిర్వహించి, భక్తులు ఉత్సాహంగా గణేశుడికి వీడ్కోలు పలికారు. శోభాయాత్ర సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అధికారులు, నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.