TG: కామారెడ్డిలో ఐదుగురు మంత్రులు పర్యటించారు. ఈనెల 15న కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ కృతజ్ఞత సభ నేపథ్యంలో మంత్రులు పొంగులేటి, సీతక్క, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, శ్రీహరి సభా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా వారికి కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ స్వాగతం పలికారు. అనంతరం మంత్రులు పలు సూచనలు చేశారు.