ప్రకాశం: ఒంగోలులోని జిల్లా కేంద్ర గ్రంధాలయంలో ఈనెల మొదటి ఆదివారం చదవడం మాకిష్టం కార్యక్రమాన్ని ఇంఛార్జ్ డిప్యూటీ లైబ్రేరియన్ సంపూర్ణ కాళహస్తి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా బుక్ షో, చెస్ పోటీలు నిర్వహించగా, పిల్లలు ఆసక్తిగా పోటీల్లో పాల్గొన్నారు. అనంతరం ఫ్యాకల్టీ జాలాది మోహన్ కోటీలు విచ్చేసి విద్యార్థులకు బుక్ రీడింగ్‌పై అవగాహన కల్పించారు.