SRCL: రుద్రంగి మండల కేంద్రంలోని పోచమ్మ కుంట వద్ద బతుకమ్మ తెప్ప నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం రూ. 5 లక్షల నిధులను మంజూరు చేసింది. స్థానిక ప్రజల, మహిళల అవసరాలను దృష్టిలో ఉంచుకుని, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రతిపాదనను జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝాకు పంపించారు. కలెక్టర్ వెంటనే స్పందించి నిధుల మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.