VSP: పెదగంట్యాడ మండలం ఇస్లాంపేటలో మహమ్మద్ ప్రవక్త 1500వ జన్మదిన వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. చిన్నపిల్లలతో ఖురాన్ పఠించే ఫోటీలు నిర్వహించి బహుమతులను అందజేశారు. ఈ సందర్భంగా జామియా మసీదు హఫీజ్ అమానత్ రసూల్ మాట్లాడుతూ.. చిన్నపిల్లలో భక్తి భావం పెంపొందించి ప్రవక్త ఆదేశాలు పాటించి సమాజంలో శాంతి నెలకొల్పే విధంగా అందరూ కృషిచేయాలని తెలిపారు.