WGL: వర్ధన్నపేట మండలం ఇల్లంద గ్రామంలో 2వ వార్డులో వర్షం ధాటికి ఇళ్లు కూలిపోయింది. తాండ్ర పద్మకు చెందిన ఇళ్లు ఇవాళ కురిసిన వర్షానికి గోడకూలి రేకులు విరిగిపోయాయి. ఇంట్లోని వస్తువులు కూడా వర్షానికి తడిసి ముద్దయ్యాయి. దీంతో ఆమె నిరాశ్రయులు అయింది. విషయం తెలుసుకున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.