E.G: కడియం మండలం దుళ్ళ గ్రామాభివృద్ధిలో మాజీ సర్పంచ్ దూడల నాగేశ్వరరావు చిత్తశుద్ధి ప్రశంసనీయమని రాష్ట్ర సినీ ఫోటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆదివారం దుళ్ళ విచ్చేసిన మంత్రి.. ఆయన మృతి పట్ల సంతాపం తెలియజేశారు. అనంతరం కుటుంబసభ్యులను పరామర్శించారు.